భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది

ఆలయ భద్రతను బలోపేతం చేయడానికి ఏర్పాట్లు.

WhatsApp Image 2025-11-20 at 5.44.33 PM

వేములవాడ : 

వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యవేక్షణలో వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్,  మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఏఈఓలు బ్రహ్మంగారి శ్రీనివాస్, జయకుమారి, జి. అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీకాంతాచార్యులు, ఇతర ఆలయ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

About The Author