స్మశానవాటికలో నిమజ్జన వినాయక విగ్రహాలు

వేసిన కాంట్రాక్టర్లపై తక్షణమే చర్య తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్

కరీంనగర్ : 

WhatsApp Image 2025-09-21 at 5.36.10 PM

హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎస్సారెస్పీ కెనాల్లో నిమజ్జనమైన వినాయక విగ్రహాలను తొలగించి చింతకుంట స్మశాన వాటికలో వేసిన కాంట్రాక్టర్లపై తనక్షణమే చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. హిందూ ప్రజలు అవమానించిన కాంట్రాక్టర్,  నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకొని పక్షంలో చింతకుంట గ్రామంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల కోసం నిర్మించిన స్మశాన వాటికలో కరీంనగర్ నుండి ట్రాక్టర్, ఆటోల ద్వారా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయకుండా స్మశాన వాటికలో వేయడంతో స్మశానవాటిక దుర్వాసనకు నిలయంగా మారిందన్నారు. 

ఆదివారం చింతకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు మరణిస్తే దాహన సంస్కార నిమిత్తం స్మశానవాటికకు తీసుకువస్తే అక్కడి దుస్థితిని చూసి ప్రజలు ఒకేసారి అవాక్కయ్యారు... ఇది చాలా బాధాకరమైన విషయమని కాళ్లు కూడా పెట్టలేని పరిస్థితిలో చెత్త వేయడం దింపుడు గళ్ళెం వద్ద వినాయక విగ్రహాల వెయ్యడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. ఆ పరిస్థితిని చూసి అక్కడ నిలబడలేని వాసనతో భరించలేక చనిపోయిన కుటుంబీకులే తాత్కాలికమైన ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకొని కొంత శుభ్రం చేయడం జరిగిందని వాపోయారు. ఇంత జరుగుతున్న నగర పాలక సంస్థ అధికారులు చూడకపోవడం శోచనీయమని చింతకుంట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను, అనారోగ్యాలకు కారకులైన సంబంధిత కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని  డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంగళవారం నాడు చింతకుంట ప్రజల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు..  

ఇప్పటికే గ్రామ పంచాయతీని నగరపాలక సంస్థలు విలీనం కావడంతో సరైన సౌకర్యాలు లేక లైటింగ్, శానిటేషన్ సక్రమంగా లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్  తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా చింతకుంట గ్రామానికి చెందిన భూక్య తిరుపతి నాయక్ గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, పెరుమళ్ళ కమల్ గౌడ్, లుక్కా విజయ్, పెరుమళ్ళ శ్యాం వెంకట చారి, సాగర్ రెడ్డి, బత్తిని సందీప్ వెంటనే వినాయక విగ్రహాలను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు... 

About The Author