మినీ మేడారం జాతరకు వేళాయే.!

మణుగూరు, ఫిబ్రవరి 10 (భారతశక్తి): మండలంలోని తోగ్గూడెం గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వేళయ్యింది. ఈ నెల 11 నుండి 15 వరకు జరిగే వన దేవతల చిన్న జాతరకు పరిసర ప్రాంతాల నుండి గిరిజనులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య, వైస్ ఛైర్మన్ బొగ్గం రాజు, కమిటీ మెబర్లు భావిస్తున్నారు. గిరిజనుల కుల దైవం ఇలావేల్పు సమ్మక్క-సారలమ్మ వన దేవతల జాతర ప్రతి ఏటా ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి సహకారం అందిస్తుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వన దేవతల పరిసరాల్లో సింగరేణి సారధ్యంతో శుభ్రం చేయిస్తున్నారు. వన దేవతల ఆలయం, ప్రధాన ద్వారం, గద్దెలకు విద్యుత్ దీపాల అలంకరణ, వివిధ రకాల రంగులతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. గద్దెల వద్ద తోపులాట జరగకుండా స్టీల్ పైపులతో చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ::జాతర మొదలయ్యేది:: తోగ్గూడెం గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేడు మంగళవారం అర్ధరాత్రి మండె వెలిగిస్తారు. మండె వెలిగించడంతో జాతర మొదలైనట్లుగా భావిస్తారు. తర్వాత రోజు బుధవారం మధ్యాహ్నం వన దేవత అయిన సారలమ్మ తల్లి ఆవిరి కుండలను ఆలయ పూజారి పర్శిక రాజమ్మ గిరిజన సంప్రదాయాల నడుమ గద్దెల పైకి తీసుకువస్తారు. 13న గురువారం సాయంత్రం సమ్మక్క దేవత ఎర్ర జెండాల కర్రలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సంకులు గద్దెలకు చేరుకుంటాయి. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో సంబురాలు ముగిస్తాయని ఆలయ కమిటీ మెంబర్లు కొమరం సైదులు, పులిమాద్రి వీరభద్రం, పిసోడి పుల్లారావు, ఇమ్మడి విరస్వామి, కొరసం రవి, ఊకె మంగ, కొమరం నిర్మల, కొమరం సరిత, అడబాల సత్యవతి, మడకం గోపమ్మలు మీడియాకు తెలిపారు

మినీ మేడారం జాతరకు వేళాయే.!

మణుగూరు, ఫిబ్రవరి 10 (భారతశక్తి): మండలంలోని తోగ్గూడెం గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వేళయ్యింది. ఈ నెల 11 నుండి 15 వరకు జరిగే వన దేవతల చిన్న జాతరకు పరిసర ప్రాంతాల నుండి గిరిజనులు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య, వైస్ ఛైర్మన్ బొగ్గం రాజు, కమిటీ మెబర్లు భావిస్తున్నారు. గిరిజనుల కుల దైవం ఇలావేల్పు సమ్మక్క-సారలమ్మ వన దేవతల జాతర ప్రతి ఏటా ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి సహకారం అందిస్తుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వన దేవతల పరిసరాల్లో సింగరేణి సారధ్యంతో శుభ్రం చేయిస్తున్నారు. వన దేవతల ఆలయం, ప్రధాన ద్వారం, గద్దెలకు విద్యుత్ దీపాల అలంకరణ, వివిధ రకాల రంగులతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. గద్దెల వద్ద తోపులాట జరగకుండా స్టీల్ పైపులతో చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు.

::జాతర మొదలయ్యేది::

తోగ్గూడెం గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర నేడు మంగళవారం అర్ధరాత్రి మండె వెలిగిస్తారు. మండె వెలిగించడంతో జాతర మొదలైనట్లుగా భావిస్తారు. తర్వాత రోజు బుధవారం మధ్యాహ్నం వన దేవత అయిన సారలమ్మ తల్లి ఆవిరి కుండలను ఆలయ పూజారి పర్శిక రాజమ్మ గిరిజన సంప్రదాయాల నడుమ గద్దెల పైకి తీసుకువస్తారు. 13న గురువారం సాయంత్రం సమ్మక్క దేవత ఎర్ర జెండాల కర్రలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సంకులు గద్దెలకు చేరుకుంటాయి. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో సంబురాలు ముగిస్తాయని ఆలయ కమిటీ మెంబర్లు కొమరం సైదులు, పులిమాద్రి వీరభద్రం, పిసోడి పుల్లారావు, ఇమ్మడి విరస్వామి, కొరసం రవి, ఊకె మంగ, కొమరం నిర్మల, కొమరం సరిత, అడబాల సత్యవతి, మడకం గోపమ్మలు మీడియాకు తెలిపారు

About The Author