శివాలయాల్లో మధుయాష్కి పూజలు
- ముచ్కుంద రామలింగేశ్వరుడికి అభిషేకం
- పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు
ఎల్‌బీనగర్:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సోమవారం పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలోని చారిత్రక ముచ్కుంద రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీలోని శివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.
మధుయాష్కి గౌడ్ వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముచ్కుంద ఆలయంలో జరిగిన పూజల్లో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్, బొగ్గారపు శరత్ చంద్ర, పోచబోయిన సురేష్ యాదవ్, శశిధర్ రెడ్డి, వెంకటాచారి, చెరుకు చిరంజీవి గౌడ్, బాబా యాదవ్, బాలకృష్ణ యాదవ్, కొండోజు శ్రీనివాస్, పాశం శ్రీకాంత్, నవీన్ చారి, కట్ట కృష్ణ ముదిరాజ్, రాహుల్ జైన్, సాయిదీప్, సాములేటి సాయి, రేణు గౌడ్, ఎర్ర శేఖర్, కొల్లూరి శ్రీనాథ్, గుడాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
