బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడికి దత్తాత్రేయ అభినందనలు
హైదరాబాద్:
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సుంకరి మల్లేశంకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో దత్తాత్రేయను మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆయనను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు అందజేశారు.
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. మల్లేశం సేవలను కొనియాడారు. ఐడీపీఎల్ (IDPL)లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మల్లేశం, కార్మికుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. బీఎంఎస్‌లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కార్మికోద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కృషి కీలకమని ప్రశంసించారు.
