జాతీయ స్థాయిలో ‘సనాతన బోర్డు’ ఏర్పాటు చేయాలి
ఆధ్యాత్మిక వేత్తలు, హిందూ సంఘాల డిమాండ్
- శ్రీశైలంలో దర్గా తొలగింపుపై హర్షం.. ‘ఛలో శ్రీశైలం’ వాయిదా*
- తిరుమల లడ్డూ కల్తీపై సిట్ విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు*
హైదరాబాద్ :
హిందూ దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ రక్షణకు జాతీయ స్థాయిలో ‘సనాతన బోర్డు’ను తక్షణమే ఏర్పాటు చేయాలని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌లో తెలంగాణ సాధు పరిషత్, సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా పాలకులు కఠిన చర్యలు తీసుకోవాలని, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు ముక్తకంఠంతో కోరారు.
అన్యామత వ్యాపారాలకు తావులేదు..
ఆలయాల పరిసరాల్లో అన్యామత కార్యక్రమాలు, బోర్డులను వెంటనే తొలగించాలని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ స్వామీజీ స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తుల వ్యాపారాలను, దేవాలయ పాలక మండళ్లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అన్యమతస్తులను కూడా తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం పాతాళ గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను ఏపీ ప్రభుత్వం స్పందించి తొలగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న పిలుపునిచ్చిన ‘ఛలో శ్రీశైలం’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ వేగవంతం చేయాలి
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు రసాయనాలు వాడారని ‘సిట్’ దర్యాప్తులో తేలడం అత్యంత విచారకరమని సనాతన ధర్మ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక ఉన్న టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆలయాలపై దాడులు చేసే వారిని పిచ్చివారిగా పేర్కొని తప్పించుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
సనాతన బోర్డుతోనే పరిష్కారం:
