ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.
- ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి.
- భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుప
పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎన్నికల కో-ఆర్డినేటర్, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులలో ఆమె విస్తృతంగా పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు.
స్థానిక సమస్యలపై ఆరా..
పర్యటనలో భాగంగా అభ్యర్థులు, స్థానిక నాయకులతో సమావేశమైన ఆమె, వార్డుల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధికే పట్టం కట్టండి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఎన్నికల ఇంచార్జులుగా వ్యవహరిస్తున్న కంటెస్టెడ్ జెడ్పీటీసీ అభ్యర్థి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీటీసీలు కుల్పగురి గోపాల్ యాదవ్, మరగారి శ్రీనివాస్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
10 Feb 2026
