శ్రీశైలం కాలినడకను బయలుదేరిన నాగర్ కర్నూల్ శివదీక్ష స్వాములు...
వైభవంగా ఇరుముడి పూజా కార్యక్రమం..
నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ కేంద్రంలోని ఎర్రగడ్డలోని సుబ్రమణ్య స్వామి దేవాలయంలో బుధవారం నాడు మల్లికార్జున సన్నిధానం శివ దీక్ష స్వాములు ఇరుముడి కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు గురుస్వామి గుంపుల విజయకుమార్ తెలిపారు. గత మండలం రోజుల నుంచి శివదీక్ష తీసుకున్న 20 మంది శివ స్వాములు వారి కుటుంబ సభ్యులు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సామూహికంగా భోజన కార్యక్రమాలు నిర్వహించారు. శివ దీక్ష స్వాములతో పాటు శివ భక్తులు కాలినడకన శ్రీశైలం పాదయాత్రతో వెళ్లారు. వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జివి రామకృష్ణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం మహాశివరాత్రి రోజు వరకు శ్రీశైలం చేరుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు రాంబాబు, ఆప్టికల్ చంద్రశేఖర్, తిరుపతయ్య, లోకేష్, శ్రీశైలం,మహేష్,శివ,శేఖర్ రామచందర్,గణపతి, శంకర్,రాము,శివ స్వాముల పాల్గొన్నారు.
