ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జి ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు
జీఎన్‌ఆర్ చైతన్య హైస్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్స్
ఎల్బీనగర్:
చైతన్యపురి–సత్యనారాయణపురం కాలనీలోని జీఎన్‌ఆర్ చైతన్య హైస్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ పరీక్షల్లో అద్భుత ప్రతిభను కనబరచి ఐదు గోల్డ్ మెడల్స్ సాధించి పాఠశాలకు గర్వకారణమయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలంటే నాణ్యమైన విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించే విధంగా బోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా జీఎన్‌ఆర్ చైతన్య హైస్కూల్‌లో సమగ్ర విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు.గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ప్రశంసించారు
About The Author
17 Apr 2026
