శ్రీశైలం వెళుతున్న శివ స్వాములకు మంగనూర్ యువత అన్న ప్రసాద,అల్పాహారం పంపిణీ....

నేటితో ముగిసిన అన్న ప్రసాద పంపిణీ....

శ్రీశైలం వెళుతున్న శివ స్వాములకు మంగనూర్ యువత  అన్న  ప్రసాద,అల్పాహారం పంపిణీ....

నాగర్ కర్నూల్:

 నాగర్ కర్నూల్ నియోజకవర్గం 
బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో మంగనూర్ యువత శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కాలినడకన వెళ్తున్న శివ స్వాములకు మరియు శివ భక్తులకు గ్రామ కే.ఎల్.ఐ కాల్వ పక్కన హనుమాన్ దేవాలయం ఆవరణలో గ్రామానికి గత ఐదు రోజులుగా అన్నప్రసాద పంపిణీ చేస్తున్నారు.బుధ వారం నాడు మంగనూరు గ్రామానికి చెందిన శివదీక్షపరుడు పుట్ట బాలరాజ్ మాధవి దంపతులు,పిట్టల భీమయ్య మనెమ్మ దంపతులు బుధవారం నాడు ఉదయ సమయంలో 550 మందికి ఉగ్గాని అల్పాహారంను, అనంతరం మధ్యాహ్న సమయంలో 1250 మంది శివ స్వాములకు అన్నప్రసాద పంపిణీ చేశారు.మంగనూరు యువత నాయకుడు షాగల అశోక్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న అన్న ప్రసాద పంపిణీ నేటితో ముంచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు దాతలకు పరమ శివుడు యొక్క కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువత షాగల యాదయ్య,కురుమూర్తి, నిరంజన్,మావిళ్ళ శివ, కుమ్మరి తిరుమల్,2023-24 మంగనూరు పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు,వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం చేరుతున్న స్వాములు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-02-11 at 17.24.00

About The Author