మున్సిపల్ ఎన్నికలకు పటిష్టమైన భారీ పోలీసు భద్రత జిల్లా ఎస్పీ.

  • -1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భారీ బందోబస్తు.
  •  -పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి రక్షణ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు.
  •  -అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కఠిన పర్యవేక్షణ.
  •  -ప్రశాంత ఎన్నికల కోసం  రాత్రింబవళ్లు విధుల్లో పోలీసులు. -నేర ప్రవృత్తులకు అవకాశం ఇవ్వం - 432 మందిపై సత్ప్రవర్తన బైండోవర్.
  • -సునిత రెడ్డి ఐపీఎస్.

మున్సిపల్ ఎన్నికలకు పటిష్టమైన భారీ పోలీసు భద్రత జిల్లా ఎస్పీ.

వనపర్తి జిల్లా: 

వనపర్తి జిల్లాలోని 5- మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  అత్యంత పటిష్టమైన భద్రత ప్రణాళికను అమలు చేస్తున్నట్లు  జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్.తెలిపారు.  అదనపు ఎస్పీ, డిస్పీలు ప్రత్యేక పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛయుత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయడం జరుగుతుంది ఆమె అన్నారు.  5-మున్సిపాలిటీలలో 80-వార్డులకు గానూ 191-కేంద్రాలు, జరుగనున్నాయని అన్నారు. ఇందులో 67-సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గుర్తించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల భద్రత అనేది సమష్టి బాధ్యతని  విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతి నిమిషం జిల్లావ్యాప్తంగా పోలీసుల కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా  జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి రక్షణతో పాటు 163 BNSS (144 సెక్షన్) ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.పోలింగ్ రోజు ఎన్నికల సరళి కై జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్, చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నాయి, శాంతియుత ఎన్నికలు  భద్రమైన ప్రజాస్వామ్యం లక్ష్యంగా పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ  తెలిపారు. ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల బరిలో గెలవాలి అన్నారు అంతేకానీ ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచెయొద్దని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 
గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడినా, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, 123 కేసులు నమోదు చేసి, 432- మందిని సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం అక్రమ రావాణాపై  జిల్లాలో  విలువైన 425 లీటర్ల మద్యం సీజ్ చేశాం అన్నారు.

About The Author