స్విమ్మింగ్ పూల్‌లో యువకుడు మృతి
- - నిర్లక్ష్యంపై ఆరోపణల
- - బాధిత కుటుంబం ధర్నా, ట్రాఫిక్‌కు అంతరాయం
- - పోలీసుల జోక్యంతో ధర్నా విరమణ
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ పట్టణంలోని తుప్రాన్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌కు వంశీ అనే యువకుడు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసినా, అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వంశీ మృతి చెందినట్లు తెలిపారు.స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బంధువులను సమాధానపరచి ధర్నాను విరమింపజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..jpeg)
