పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా చక్రస్నానం..
కాప్రా:
కాప్రా చెన్నకేశవ స్వామి ఆలయంలో 14 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుదర్శన హోమం, హనుమాన్ హోమం, జాంబవంతుని హోమం, చక్ర స్నానం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమీప కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, విశ్వహిందూ పరిషత్ ఆల్ ఇండియా గవర్నింగ్ కమిటీ సభ్యులు రాఘవులు, రాష్ట్ర గవర్నింగ్ కమిటీ సభ్యులు లక్ష్మీ శేఖర్, మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఈఓ కృష్ణమా చార్యులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నల్లూరి శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ కొండారెడ్డి, డీఎన్, ప్రసాద్, కమిటీ మాజీ సభ్యులు పీసర మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, శంకర్ బాబు, మురళి పంతులు, విజయేందర్ రెడ్డి, మోహన్, గజేందర్ రెడ్డి, ఆలయ జూనియర్ అసిస్టెంట్ టి. శ్రీనివాస్, ముఖేష్, మోహన్, విశ్వం తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సోలిస్ కంటి ఆసుపత్రి సిబ్బంది సేవలు అందజేశారు.
