సమస్యల పరిష్కారానికి సహకరించండి
- ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రజా ఉద్యమం తప్పదు..
- బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
రామచంద్రాపురం :
రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల బిహెచ్ఇఎల్ భూములకు సంబంధించి నెలకొన్న వివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. కాలయాపన చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురుకోవాల్సి వస్తుందని బిహెచ్ఈఎల్ యాజమాన్యానికి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం బిహెచ్ఇయల్ ఈడి శ్రీనివాస్, ఏజిఎం సురన్ ప్రసాద్ లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.
ప్రధానంగా ఈఎస్ఐ చర్చి సమీపంలో గల బీరప్ప గుడిని బిహెచ్ఇయల్ పరిశ్రమ భూమిలో ఉందంటూ సంబంధిత అధికారులు తొలగించడం జరిగిందని తెలిపారు. ఇది మాత్రం సమంజసం కాదని.. పరిశ్రమ ఏర్పాటు చేయకముందు నుండి గుడి అక్కడే ఉందని తెలిపారు. వెంటనే అదే స్థలంలో గుడిని పునర్నిర్మాణం చేపట్టకపోతే ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఈఎస్ఐ సమీపంలో గల క్రిస్టియన్ కమ్యూనిటీ స్మశాన వాటికలో కేవలం బీహెచ్ఈఎల్ ఉద్యోగులకు..వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అంత్యక్రియలకు అనుమతిస్తున్నారని స్థానికులు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. స్థానికులకు సైతం అనుమతించాలని కోరారు. అదే విధంగా హిందూ స్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు అభ్యంతరాలు తెలుపవద్దని కోరారు.
