వృత్తి పరమైన జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొంది తన కోసం సమయాన్ని కేటాయించే సమయమే పదవి విరమణ : తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా

విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ సూర్యాపేటజిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల అదనపు గిర్దావర్ పోటు సూర్య నారాయణ- జ్యోతి పదవీ విరమణ సందర్భంగా తహశీల్దార్ నాగార్జున రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా,సభ్యులు కొల్లుజు నాగేంద్ర చారి, కొత్తపల్లి మధుసూదన్, భీమపంగు వెంకటేశ్వర్లు, నందిగామ నాగేంద్ర కుమార్, షేక్ నవాబ్ జాని లతో కలిసి పాల్గొని పోటు సూర్య నారాయణ-జ్యోతి దంపతులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువా తో సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సైదా మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్ జీవితంలో ఒక ప్రధాన అంశమని పదవీ విరమణ చేసే వ్యక్తికి సంతోషకరమైన మరియు విచారకరమైన మిశ్రమ భావాల క్షణాలు రెండూ కండ్ల ముందు మెరుస్తాయన్నారు. వృత్తి పరమైన జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొంది తన కోసం సమయాన్ని కేటాయించే సమయమే రిటైర్మెంట్ అని అన్నారు. పోటు సూర్యనారాయణ గత 40 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా జీవితం మొదలుపెట్టి రిటైర్మెంట్ సమయంలో మండల అదనపు గిర్ధవర్ గా తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేస్తూ తన పనితో పని పాటు అందరు పనిని తన పనిగా భావించి పని చేసే వారిని తోటి సిబ్బందితోనూ ప్రజలతోనూ స్నేహభావంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించారని సూర్య నారాయణ జీవితం తెరిచిన పుస్తకము అని సేవలను కొనియాడారు.

About The Author