రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది

  • - వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకూడదు
  • - ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది

సిద్దిపేట:

యాసంగి సీజన్‌లో వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా రైతులకు సకాలంలో సేవలు అందించాలని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ సూచించారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనీ, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.ఈ సందర్భంగా చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లిపూర్, మాచపూర్ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, సీసీ వైకుంఠంతో కలిసి ప్రారంభించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సర్టిఫై చేసిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లర్లకు పంపించాలని, తాలు కటింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. అనంతరం మాచపూర్ బీసీ కాలనీలో సర్పంచ్ యట సత్యలక్ష్మి యాదగిరితో కలిసి సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-16 at 19.35.25

About The Author