రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు చేపట్టాలి
ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్
చిన్న కోడూరు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి, చౌడరాం, ఎల్లమ్మజాలు, చెల్కలపల్లి గ్రామాల్లో ఎఫ్ఎస్సిఎస్ అల్లీపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులు, హమాలీలు, అధికారుల సమక్షంలో మాట్లాడిన ఆయన, వడ్ల కొనుగోలు ప్రక్రియలో గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగార్జున రెడ్డి, వాసుదేవ దేవా చారి, రేఖ సంతోష్, డైరెక్టర్లు పాకాల భూపతి రెడ్డి, సింగిరాల లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదుగాని లహరి, నాయకులు గొట్టిపర్తి చంద్, మేడుపల్లి శ్రీకాంత్, వార్డ్ సభ్యులు గొట్టిపర్తి మౌనిక, రామకృష్ణ నవీన్, ఏఈవోలు, ఎఫ్ ఎస్ సిఎస్ సీఈఓ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
