గాడ్జెట్‌ల లేని బాల్యం పై జిఎంఆర్ అవగాహన రన్

గాడ్జెట్‌ల లేని బాల్యం పై జిఎంఆర్ అవగాహన రన్

సిద్దిపేట:

విద్యార్థులు చిన్న వయసులోనే సెల్‌ఫోన్లు, టీవీలకు బానిసలు కాకుండా చూడాలని సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్, రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నూనిగాని రాజు సూచించారు. ఆదివారం జిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన “జిఎంఆర్ 1కే రన్ – గాడ్జెట్‌ల లేని బాల్యం” కార్యక్రమాన్ని ఎస్సై రాజేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ డైరెక్టర్లు హరిపాల్, సాయినాథ్, సంపత్, రాజు, మాళవిక మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “గాడ్జెట్‌ల లేని బాల్యం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించి, అవుట్‌డోర్ ఆటలకు ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమంలో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-19 at 19.47.34

About The Author