సామజిక న్యాయమే కాంగ్రెస్ ద్యేయం.! రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం
భద్రాచలం, ఫిబ్రవరి 04 (భారతశక్తి): పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య నివాసంలో సోమవారం ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి లక్షల డప్పులు వేలాది గొంతులు కర్ర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొదేం వీరయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి వర్గీకరణకు కట్టుబడి ఉందని, ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని తెలిపారు. మాదిగ మాదిగ ఉప కులాలు చేసిన న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ పిబ్రవరి 7న హైదరాబాద్ నడి బొడ్డున జరిగే మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శనను ప్రపంచం మొత్తం మాదిగల వైపు చూసే విధంగా చిర్రలు, చిటికెడు పుల్లలతో డప్పుల మోత మోగించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధానిలో ఎన్నడూ జరగని రీతిలో పెద్దలు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుకు మాదిగ, మాదిగ ఉపకులాలు ఎర్రటి ఎండలో గుండెమీద డప్పు పెట్టి కొట్టడానికి మాదిగలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేకల లత, జిల్లా ఉపాధ్యక్షులు కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గొడేటి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రేమ్ సాయి, వరుణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.