అంబేడ్కర్‌కు మధుయాష్కి నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రాణిపేట జిల్లా కేంద్రంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ కుమార్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. రాజ్యాంగ రచన ద్వారా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వాన్ని కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
About The Author
15 Apr 2026
