జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

రాజన్న సిరిసిల్ల :

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. 
టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా. 
కలెక్టరేట్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో  నిరసన తెలిపిన జర్నలిస్టులు.

WhatsApp Image 2025-09-15 at 6.17.11 PM

తెలంగాణ రాష్ట్రంలోని  జర్నలిస్టుల రక్షణకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వారినీ శిక్షించే హక్కు చట్టానికి ఉందనీ, అనవసరమైన, అసత్య ఆరోపణలపై జర్నలిస్టులపై కేసులు పెట్టి  ఇబ్బందులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కారని నిజంగానే తప్పులు చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షించాలని కోరారు. వృత్తిలో భాగంగా జర్నలిస్టులు కవరేజ్ కు వెళ్లిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామికమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న ఫోర్త్ ఎస్టేట్ గా భావిస్తున్న మీడియా జర్నలిస్టులు ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈమధ్య జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కఠినమైన చట్టాలను తయారు చేసి వాటిని అమలు చేసే విధంగా పోలీస్, రెవెన్యూ శాఖలను ఆదేశించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

About The Author