తాపీ మేస్త్రిల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం..
భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్:
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రిల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల ట్రేడ్ యూనియన్ మరియు తాపీ మేస్త్రి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సమస్యల పరిష్కారానికి సామర్ధ్యంతో ముందుకు వెళుతూ సమన్వయంతో పని చేసుకోవాలని సూచించారు. అతి త్వరలో తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటి సుధాకర్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సంఘం అధ్యక్షులు నాగేందర్, తదితరులు పాల్గొన్నారు..jpeg)
