రాష్ట్ర బహిరంగ సభను జయప్రదం చేయండి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప
వికారాబాద్:
యాలాల... తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు మహబూబ్ నగర్ లో ఈ నెల 20,21,22 తేదీలల్లో జరుగుతున్నాయి అని ఈ సభలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప పిలుపునిచ్చారు.
శుక్రవారం యాలాల మండల పరిధిలోని కమాల్ పూర్ గ్రామం లో కూలీలతో కలిసి మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేశాడు.
ఈ సందర్బంగా బుగ్గప్ప మాట్లాడుతూ వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలను అత్యంత ప్రతిష్టoగా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు హాజరు అవుతారు అని రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు మరియు పక్క ఐదు రాష్ట్రల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారనితెలిపాడు.
ఈ మహాసభలకు పార్టీలకు అతితంగా సహకరించాలని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక,కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుది అని అన్నారు.కేంద్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను తొలిగించి,కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్స్ లను తీసుకురావడం జరిగింది అన్నారు. కొనుగోలు శక్తి పెంచడానిక.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కార్మిక విధానలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం రాబోయే కాలంలో పెద్దఎత్తున పోరాటలు చేయడానికి ఈ మహాసభలు పునాదిగా మారుతాయి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు టీ.లాలయ్య, వెంకటేష్,ఉషాప్ప,శ్రీనివాస్,కుర్వ శ్రీను,నరేష్,లక్ష్మి,మరియు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
