పేరు ప్రకటించారు…. బీ ఫామ్ ఇస్తారా..
కరీంనగర్, సెప్టెంబర్ 30 పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌ఎస్? క్యాండిడేట్లకు బీఫాం టెన్షన్?పట్టుకుంది. టికెట్?కన్ఫాం అయినా బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రోజువిడిచి రోజు హైదరాబాద్?చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు రెబల్స్? కేటీఆర్?తో ఫొటోలు దిగి సోషల్?విూడియాలో అప్?లోడ్? చేస్తున్నారు. చివరి నిమిషంలో కేటీఆర్? మనసు మారితే తమకే టికెట్ దక్కుతుందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ హైకమాండ్? సిట్టింగులకే టికెట్లు కన్ఫాం చేసింది. అయినప్పటికీ బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అభ్యర్థులతోపాటు క్యాడర్? భావిస్తున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో బీఆర్‌ఎస్? నుంచి హావిూలు పొందినవారికి టికెట్లు దక్కలేదని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గతంలో కంటే తీవ్రంగా ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. టిక్కెట్? ఆశించి భంగపడ్డ లీడర్లు హైకమాండ్?ను ధిక్కరిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులను మార్చాల్సిందేనని, ఆయా పార్టీల్లో ఉన్న వివిధ కులాలకు చెందిన లీడర్లు కూడా బహిరంగంగానే డిమాండ్? చేస్తున్నారు. దీంతో హైకమాండ్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.టికెట్లు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులతోపాటు క్యాడర్? కూడా గందరగోళంలో ఉంది. పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా.. సీఎం కేసీఆర్? సిట్టింగులకే టికెట్లు ప్రకటించడంతో ఆశావహులు కొంత ఇబ్బంది పడ్డారు. కాగా సిట్టింగ్‌లకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీ లీడర్లు, క్యాడర్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ సిట్టింగులు బరిలోకి దిగితే పార్టీ ఓడిపోతుందని బహిరంగంగానే చెబుతున్నారు. కాగా టిక్కెట్? కన్ఫాం అయిన లీడర్లతోపాటు రెబల్స్? కూడా ప్రచారం చేసుకుంటుండటంతో క్యాడర్?కన్ఫ్యూజన్‌లో ఉంది. టిక్కెట్? కన్ఫాం అయిన అభ్యర్థులతో పాటు రెబల్స్?కూడా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఓ రెబల్?అభ్యర్థి మంత్రి కేటీఆర్? కలవగానే మరుసటి రోజే టిక్కెట్?కన్ఫాం అయిన అభ్యర్థి కూడా కలుస్తున్నారు. టిక్కెట్? కన్ఫాం అయిన అభ్యర్థులు ప్రజల్లో తిరగాల్సి ఉండగా, ఇంకా రాజధానికి తిరగాల్సి వస్తోందని క్యాడర్?మాట్లాడుకుంటున్నారు. ఆశావహులు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏనిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు వీరంతా హైదరాబాద్ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఒకవైపు వ్యతిరేకత ఉండడం, మరోవైపు రెబల్స్? ఏమేరకు నష్టం చేస్తారోనన్న అనే ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో తిరిగితే దళితబంధు, బీసీ బంధుపై ఆశావహులు డైరెక్ట్?గానే నిలదీస్తున్నారు. రెండు స్కీముల్లో 90 శాతం బీఆర్‌ఎస్? కార్యకర్తలకే లాభం జరుగుతుండడంతో, సాధారణ ప్రజానీకం తిరగబడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఒకటి, రెండు చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో తిరగాలంటే అభ్యర్థుల్లో వణుకుపుడుతోంది.
కరీంనగర్, సెప్టెంబర్ 30
పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌ఎస్? క్యాండిడేట్లకు బీఫాం టెన్షన్?పట్టుకుంది. టికెట్?కన్ఫాం అయినా బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రోజువిడిచి రోజు హైదరాబాద్?చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు రెబల్స్? కేటీఆర్?తో ఫొటోలు దిగి సోషల్?విూడియాలో అప్?లోడ్? చేస్తున్నారు. చివరి నిమిషంలో కేటీఆర్? మనసు మారితే తమకే టికెట్ దక్కుతుందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ హైకమాండ్? సిట్టింగులకే టికెట్లు కన్ఫాం చేసింది. అయినప్పటికీ బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అభ్యర్థులతోపాటు క్యాడర్? భావిస్తున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో బీఆర్‌ఎస్? నుంచి హావిూలు పొందినవారికి టికెట్లు దక్కలేదని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గతంలో కంటే తీవ్రంగా ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. టిక్కెట్? ఆశించి భంగపడ్డ లీడర్లు హైకమాండ్?ను ధిక్కరిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులను మార్చాల్సిందేనని, ఆయా పార్టీల్లో ఉన్న వివిధ కులాలకు చెందిన లీడర్లు కూడా బహిరంగంగానే డిమాండ్? చేస్తున్నారు. దీంతో హైకమాండ్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.టికెట్లు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులతోపాటు క్యాడర్? కూడా గందరగోళంలో ఉంది. పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా.. సీఎం కేసీఆర్? సిట్టింగులకే టికెట్లు ప్రకటించడంతో ఆశావహులు కొంత ఇబ్బంది పడ్డారు. కాగా సిట్టింగ్‌లకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీ లీడర్లు, క్యాడర్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ సిట్టింగులు బరిలోకి దిగితే పార్టీ ఓడిపోతుందని బహిరంగంగానే చెబుతున్నారు. కాగా టిక్కెట్? కన్ఫాం అయిన లీడర్లతోపాటు రెబల్స్? కూడా ప్రచారం చేసుకుంటుండటంతో క్యాడర్?కన్ఫ్యూజన్‌లో ఉంది. టిక్కెట్? కన్ఫాం అయిన అభ్యర్థులతో పాటు రెబల్స్?కూడా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఓ రెబల్?అభ్యర్థి మంత్రి కేటీఆర్? కలవగానే మరుసటి రోజే టిక్కెట్?కన్ఫాం అయిన అభ్యర్థి కూడా కలుస్తున్నారు. టిక్కెట్? కన్ఫాం అయిన అభ్యర్థులు ప్రజల్లో తిరగాల్సి ఉండగా, ఇంకా రాజధానికి తిరగాల్సి వస్తోందని క్యాడర్?మాట్లాడుకుంటున్నారు. ఆశావహులు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏనిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు వీరంతా హైదరాబాద్ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఒకవైపు వ్యతిరేకత ఉండడం, మరోవైపు రెబల్స్? ఏమేరకు నష్టం చేస్తారోనన్న అనే ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో తిరిగితే దళితబంధు, బీసీ బంధుపై ఆశావహులు డైరెక్ట్?గానే నిలదీస్తున్నారు. రెండు స్కీముల్లో 90 శాతం బీఆర్‌ఎస్? కార్యకర్తలకే లాభం జరుగుతుండడంతో, సాధారణ ప్రజానీకం తిరగబడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఒకటి, రెండు చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో తిరగాలంటే అభ్యర్థుల్లో వణుకుపుడుతోంది.
