రెండవ విడత ఎన్నికలు ప్రశాంతం

కేంద్రాలల్లో బందోబస్తు తీరును పర్యవేక్షించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం

రెండవ విడత ఎన్నికలు ప్రశాంతం

WhatsApp Image 2025-12-14 at 4.42.51 PM (1)

కరీంనగర్ :

రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి లోని పోలింగ్ కేంద్రాలను సీపీ గౌస్ అలం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ​ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ​ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ​రెండవదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సీపీ ఈ సందర్బంగా తెలిపారు. 

About The Author