గడ్డిఅన్నారం డివిజన్‌లో “నిరుద్యోగుల వంచన సభ”

గడ్డిఅన్నారం డివిజన్‌లో “నిరుద్యోగుల వంచన సభ”

ఎల్బీనగర్

గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “నిరుద్యోగుల వంచన సభ” కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాకేష్ రెడ్డి,అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. “ఉద్యోగం యువత హక్కు – వంచన ఇక చాలు” అనే నినాదంతో నిరుద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో భవాని ప్రవీణ్ కుమార్, జిన్నారం విఠల్ రెడ్డి రమేష్ ముదిరాజ్, బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, గండి సన్నీ యాదవ్ అలాగే నిరుద్యోగులు ఇంద్రనాయక్, కుమార్, ఆకాష్, శంకర్, శంబు, నవీన్, ఉపేందర్, సింధు, విక్రమ్, దామోదర్ రెడ్డి, అశోక్, సాల్మన్ తదితర నిరుద్యోగ యువత పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు హాజరై సభను విజయవంతం చేశారు.WhatsApp Image 2026-06-04 at 19.35.08 (3)

About The Author