జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్:

విద్యాసంస్థలు విద్యార్థులను కేవలం పరీక్షలకే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.

 మొకిలాలోని ‘ది క్వాంటియం స్కూల్’ను ఆదివారం రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి కాలంలో విద్య పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మానసిక, సామాజిక, శారీరక వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌తో కలిసి పాఠశాల చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధకులు మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకులని చెప్పారు.
క్వాంటియం స్కూల్ భవిష్యత్తులో నాణ్యమైన విద్యకు ఆదర్శంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన గవర్నర్, విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో ఎంపీ లు శ్రీమతి డీకే అరుణ, శ్రీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ ,
 స్కూల్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మురికి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-31 at 21.19.43

About The Author