తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ పాత్ర చిరస్మరణీయం..బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు

వికారాబాద్:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నాయకులు అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఉద్యమకారుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావుల మార్గదర్శకత్వంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా తెలంగాణ దేశంలోనే అభివృద్ధి రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
అనంతరం పట్టణంలోని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, వెంకట్ రెడ్డి, మంకల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, మధు గౌడ్, చందర్ ఇర్ఫాన్, భషారత్, చెన్ బసప్ప, రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే కౌన్సిలర్లు నవీన, సుప్రియ, నాగలక్ష్మి, జావేద్, యోగానంద్, ఇర్షాద్, సురేష్ నాయక్, నాయకులు సలీం, సంతోష్ గౌడ్, గుండప్ప కరుణాకర్, రుద్రు పాటిల్, భీమ్ సింగ్, అనంత రెడ్డి, చెన్నారెడ్డి, కోట్రీకే శ్రీకాంత్, అంజాద్ ఖాన్, ఫైసల్ ఖాన్, అస్ఫక్, బీఆర్ఎస్వీ నాయకులు ఇబ్రహీం, వినోద్, సోహెబ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.WhatsApp Image 2026-06-02 at 19.39.13 (3)

About The Author