తెలంగాణ అవతరణ దినోత్సవ కానుకగా "రావయ్యా మా పెద్దసారు" పాట
- - మాజీ మంత్రి కేటిరామ రావు చేతుల మీదుగా ఆవిష్కరణ
- - ముక్కపల్లి శ్రీనివాస్ అభినందించిన కేటిఆర్
సిద్దిపేట:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ప్రముఖ గాయకుడు, రచయిత ముక్కపల్లి శ్రీనివాస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై అభిమానంతో రచించి ఆలపించిన "రావయ్యా మా పెద్దసారు" పాటను మాజీ మంత్రి కే . టి . రామ రావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ పాట ఉందని ప్రశంసించారు. కళాకారులు, రచయితలు తమ సృజనాత్మకతతో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ భావజాలాన్ని భావితరాలకు చేరవేయడం అభినందనీయమన్నారు. ముక్కపల్లి శ్రీనివాస్ రచించి, స్వయంగా ఆలపించిన ఈ పాట ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ నిర్మాత నాగరాజు జర్నలిస్టు చిన్ని కృష్ణ ఉపాధ్యాయులు బాలయ్య తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
