తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువలేనివి : బీజేపీ నాయకులు

తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువలేనివి : బీజేపీ నాయకులు

ఎల్బీనగర్:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
బీజేపీ నాయకుడు అంకంగారి నవకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో హుడా కాంప్లెక్స్ లో తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహాన్ని పూల మాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల సురేష్ కుమార్, రాష్ట్ర దళిత మోర్చా నాయకుడు బాణాల ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘’నేడు మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగ ఫలమని, వారి బలిదానాలను మనం ఎప్పటికీ మర్చిపోవద్దని తెలిపారు. అమరుల ఆశయ సాధన కోసం మనమంతా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే, నాడు పార్లమెంట్‌లో దేశం చూపు మొత్తం మన తెలంగాణ వైపు తిరిగేలా ప్రసంగించి,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 'తెలంగాణ చిన్నమ్మ' స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ చారిత్రాత్మక కృషి చిరస్మరణీయమని , ఈ తెలంగాణ గడ్డ వారిని ఎన్నటికీ మరువదని తెలిపారు.’’ ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకులు బాణాల ప్రవీణ్ కుమార్ గారు, బీజేపీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బెంగారబోయిన సురేష్ , మాజీ డివిజన్ అధ్యక్షుడు సిద్ది ముదిరాజ్ , జంగయ్య ముదిరాజ్, సుమ, సరస్వతి,సుజాత, మూర్తి యువ మోర్చా నాయకులు పంతంగి రంజిత్ కుమార్, పొన్నం బద్రి, ఎర్రన్న, రామరావు, నాగరాజ్, మనోహర్,కొండే రాజేష్,శ్రీకాంత్, ప్రవీణ్,ఇంద్ర తేజ, సంజయ్, శైలేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author