‘సబితమ్మ’ సామర్థ్యం.. మహేశ్వరం ప్రగతి ప్రస్థానం!
- నాడు పోరాటం.. నేడు పునర్నిర్మాణం: కేసీఆర్ అడుగుజాడల్లో మాజీ మంత్రి అప్రతిహత ప్రయాణం
- *విద్యుత్, సాగునీరు, సంక్షేమంలో మహేశ్వరాన్ని అగ్రగామిగా నిలిపిన సబితా ఇంద్రారెడ్డి
- *పార్టీ పటిష్టతే శ్వాసగా సభ్యత్వ సమరానికి శంఖారావం.. గులాబీ కోటలో సగర్వ శ్రేణులు
మహేశ్వరం:
తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక చెరగని ముద్ర. ప్రజా సమస్యల పరిష్కారంలో చిరునవ్వుతో కూడిన పట్టుదల ఆమె శైలి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా, స్వరాష్ట్రంలోనూ కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత ఆమెది. ఆమే.. మహేశ్వరం శాసనసభ సభ్యురాలు, మాజీ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ.. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్రతినిధుల సభ, కేవలం ఒక ఉత్సవంగా కాక, ఆమె నాయకత్వ పటిమకు, నియోజకవర్గ ప్రగతిపై ఆమెకున్న స్పష్టమైన విజన్‌కు అద్దం పట్టింది. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ, మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపిన సబితా ఇంద్రారెడ్డి రాజకీయ, పరిపాలనా ప్రస్థానంపై ‘భారత శక్తి’ ప్రత్యేక పరిశోధనాత్మక కథనం..jpeg)
తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి అభివృద్ధి సమయం వరకు విశ్లేషిస్తే.. సబితా ఇంద్రారెడ్డి పాత్ర అత్యంత క్రియాశీలకమైనదిగా కనిపిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలోని పదేళ్ల సువర్ణ పాలనలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టి, కీలక నిర్ణయాలతో తనదైన ముద్ర వేశారు.
సమావేశంలో ఆమె ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. కేసీఆర్ దూరదృష్టిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె ఎంతటి నిబద్ధతతో ఉన్నారో స్పష్టమవుతుంది.
*వ్యవసాయ విప్లవం: 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ చేరేలా ఆమె ప్రత్యేక నిఘా పెట్టారు.
*పారిశ్రామిక హబ్‌గా మహేశ్వరం: ఐటీ, ఫార్మా, పరిశ్రమల విస్తరణలో మహేశ్వరం ప్రాంతం దేశంలోనే ప్రముఖ కేంద్రంగా మారడం వెనుక స్థానిక శాసనసభ సభ్యురాలిగా ఆమె అందించిన సహకారం, చూపిన చొరవ అసాధారణమైనవి.
*క్షేత్రస్థాయి పరిశీలన: సంక్షేమ పథకాల విజయవంతంలో సబితమ్మ మార్క్
పరిశోధనాత్మకంగా పరిశీలిస్తే, మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలను అర్హులకు చేర్చడంలో సబితా ఇంద్రారెడ్డి
అహర్నిశలు శ్రమించారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ప్రజాప్రతినిధి అంటే కేవలం అధికారానికి పరిమితం కాదని, ప్రజల సేవకురాలని ఆమె నిరూపించారు. "కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు జరిగిన అభివృద్ధి ఒక చరిత్ర. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన ఘనత ఆయనది. నాడు కేసీఆర్ చూపిన బాటలోనే నేడు మహేశ్వరం నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది."
సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి & శాసనసభ సభ్యురాలు,
*గులాబీ కోటలో ‘సభ్యత్వ సమరం’.. కార్యకర్తలకు దిశా నిర్దేశం
కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, పార్టీ పటిష్టత విషయంలోనూ 'సబితా ఇంద్రారెడ్డి' తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలని ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహేశ్వరం నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటగా మార్చడమే లక్ష్యంగా ఆమె వ్యూహ రచన చేస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగురవేస్తూ, క్షేత్రస్థాయి కార్యకర్తను సైతం గుండెలకు హత్తుకుంటూ ఆమె సాగుతున్న తీరు మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
*జన హృదయ నేతగా సబితమ్మ:
పీఎస్‌వై కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ భారీ కార్యకర్తల సమావేశం సబితా ఇంద్రారెడ్డి పట్ల నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉన్న నమ్మకాన్ని, ఆదరణను మరోసారి నిరూపించింది. సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఒకే తాటిపైకి వచ్చి, ఆమె నాయకత్వాన్ని బలపర్చడం గమనార్హం. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా, కేసీఆర్ ఆలోచన విధానాన్ని నరనరాన జీర్ణించుకుని సాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, ప్రస్థానం మహేశ్వరం నియోజకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
