ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న రెవెన్యూ అధికారులు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎల్బీనగర్:

సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఉప తహసీల్దార్ భానుప్రసాద్, జిల్లా స్పోర్ట్ ఆథారిటీ అధికారిణి స్వర్ణలత, అధికారులు, క్రీడా కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం సరూర్నగర్ మండల్ తహాసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్, ఉప తహసీల్దార్ భానుప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.WhatsApp Image 2026-06-02 at 19.27.27 (1)

About The Author