అనాథ విద్యార్థులకు జూనియర్ ఛాంబర్ శాఖల విరాళం
ఎల్బీనగర్:
ఆర్కేపురంలోని అనాథ విద్యార్థి గృహంలో ఉంటున్న 100 మంది విద్యార్థులకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శాఖ -- హైదరాబాద్ ఛాంపియన్స్ మరియు సికింద్రాబాద్ దాపోదిల్స్ శాఖల సభ్యులు సోమవారం ప్రఖ్యాత వారిస్ కంపెనీకీ చెందిన 100 వాటర్ బాటిల్స్ ను ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ భరత్ ఆచార్య చేతుల మీదుగా అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశంతో రెండు రాష్ట్రాలలోని అనాథ, నిరుపేదలను తీసుకొని వారికి అన్ని సౌకర్యాలు కల్పించి, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తు కోసమే కృషి చేస్తున్న అనాథ విద్యార్థి గృహ కమిటీని అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అత్యవసరమైన స్టీల్ వాటర్ బాటిల్స్ అత్యవసరమని విద్యార్థుల ద్వారా తెలుసుకొని డబ్బుకు వెనుకాడక జెసిఐ హైదరాబాద్ ఛాంపియన్స్ మరియు జెసిఐ సికింద్రాబాద్ డఫసిల్స్ శాఖల వారు ఈ విద్యార్థి గృహములోని విద్యార్థులకు 100 వాటర్ స్టీల్ బాటిల్స్ ను అందజేయాలని నిర్ణయించుకున్నందుకు ఆ శాఖల బాధ్యులను నేషనల్ ప్రెసిడెంట్ భరత అభినందించారు.ఈ కార్యక్రమంలో జెసిఐ 12 వ జోన్ అధ్యక్షులు గౌతమ్ కుమార్ జైన్, హైదరాబాద్ ఛాంపియన్స్ అధ్యక్షులు కిషోర్ కుమార్ , సికింద్రాబాద్ దాపోదిల్స్ శాఖ ముఖ్యులు అనిత చెక్కాలా,అనాథ విద్యార్థుల గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ పాల్గొన్నారు.
