రాక్ టౌన్ కాలనీ నీటి కష్టాలు తీర్చాలి

  • ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేసిన రాక్ టౌన్  కాలనీ సంక్షేమ సంఘం 
  • ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి విజ్ఞప్తి.

రాక్ టౌన్ కాలనీ నీటి కష్టాలు తీర్చాలి

నాగోల్:

నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని కాలనీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్, మనసురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బృందంతో  కాలనీ ప్రతినిధులతో కలిసి మల్కాజ్గిరి ఎం.పీ ఈటెల రాజేందర్ గారికి వినతిపత్రం అందజేశారు.

*వేసవి ఇబ్బందులపై వినోద్ రెడ్డి ఆవేదన
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో నీటి కొరత తీవ్రంగా ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వేసవి కాలంలో కాలనీవాసులు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను వివరించారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, ఇందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. కాలనీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్.. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

*కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, కాలనీ ఉపాధ్యక్షుడు మణిపాల్ రెడ్డి, సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, సంజీవరెడ్డి, భీమిడి వెంకట్ రెడ్డి, రామ్ రెడ్డి, కొండల్ రెడ్డిలతో పాటు స్థానిక నాయకులు, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.

About The Author