గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గెస్ట్ అధ్యాపక పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  సరూర్ నగర్ జోన్ - 6 అధికారి భీమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (లా) 6 పోస్టులు, గెస్ట్ డిగ్రీ లెక్చరర్ ఇంగ్లీష్ 1 పోస్టు, గెస్ట్ లైబ్రేరియన్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఏదైనా స్పెషలైజేషన్‌లో ఎల్ఎల్ఎంలో కనీసం 55 శాతం మార్కులతో పాటు యుజిసి-నెట్ /పిహెచ్ డి వారికి ప్రాధాన్యత, డిగ్రీ లెక్చరర్ ఇంగ్లీష్ కు ఎంఏ ఇంగ్లీష్ యుజిసి - నెట్ ఉన్నవారికి ప్రాధాన్యత, లైబ్రేరియన్ కు ఎంఎల్ఐఎస్సి ప్రాధాన్యత ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 4 నుండి 14 లోపు తమ అప్‌డేట్ చేసిన సివి అన్ని ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్ల స్కాన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో క్రింది మెయిల్‌కు పంపాలని సూచించారు. 
Email: prl-rdcw-lbngr-swrs@telangana.gov.in ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9603617134 లో సంప్రదించాలని కోరారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డెమో క్లాస్ నిర్వహించబడుతుందని డెమో క్లాస్‌లోని ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుందని వివరించారు.ఇతర వివరాలకు 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాల చైతన్యపురి మెట్రో స్టేషన్, పిల్లర్ నం. 1570, బస్ స్టాండ్ వెనుక సర్వీస్ రోడ్ లోని తమ కళాశాలలో సంప్రదించవచ్చునని భీమయ్య సూచించారు.

About The Author