మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్‌చెరు :
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే జిఎంఆర్..ఆయనకు శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్ రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, చిరకాలం ప్రజా సేవలో ఉండాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
05 Jun 2026
