టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం – ప్రజా వాణి ఫిర్యాదులకు పరిష్కారం లేదా..?

టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం – ప్రజా వాణి ఫిర్యాదులకు పరిష్కారం లేదా..?

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని బీడీ రెడ్డి గార్డెన్ నుండి నంది హిల్స్ రహదారిపై భారీ అక్రమ షెడ్ నిర్మాణం జరుగుతోందని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.అక్రమ నిర్మాణాల విషయంలో హైకోర్టు పలు సందర్భాల్లో కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటి అమలులో స్థానిక అధికారుల వైఖరి ప్రశ్నార్థకంగా మారిందని కాలనీవాసులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నా, వాటిని అడ్డుకునే చర్యలు లేకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రజా వాణిలో పలుమార్లు ఫిర్యాదులు నమోదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సాధారణ ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా వాణిలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను అడ్డుకొని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు.

About The Author