ఆర్ఆర్ఆర్ సెంటర్ ప్రారంభించిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్లు

ఆర్ఆర్ఆర్ సెంటర్ ప్రారంభించిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్లు

ఎల్బీనగర్:

మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్  సరూర్ నగర్ సర్కిల్ లోని ఓజోన్ హాస్పిటల్స్ వారి సహకారంతో బుధవారం చిత్రా లేఔట్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ద్వారా ఆర్ఆర్ఆర్ సెంటర్ ను ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు . దీనికి ఓజోన్ హాస్పిటల్స్ వారు ఆర్థిక సహకారం అందించారు.ఆర్ఆర్ఆర్ సెంటర్ అనగా రీయూజ్, రెడ్యూస్ , రిసైకిల్ వస్తువులు ఉదాహరణగా బట్టలు, పుస్తకాలు, సోఫాసెట్, కుర్చీలు, కూలర్లు,ఇతరత్ర ఎలాంటి ఉపయోగకర వస్తువులు ఈ సెంటర్లో అందజేయవచ్చును,  మరియు మనకు అందులో అవసరం ఉన్న వస్తువులు తీసుకునే విధంగా ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్, ఎల్బీనగర్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్, శానిటేషన్ డిఈ చందన,ఏఈ షరీఫ్,ఎస్ఎస్ బుచ్చయ్య,ఓజోన్ హాస్పిటల్ పి.ఆర్.ఓ రవీందర్ రెడ్డి,కాలనీ వాసులు సెక్రటరీ గణేష్, సత్యనారాయణ రెడ్డి, రంగారావు, కిషోర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,తిరుపతి రావు, రవికుమార్, అంజల్ రావు, రాధిక,ఎస్ఎఫ్ఏలు కొండల్ రెడ్డి, కీర్తన,శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author