నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు
- పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- పటాన్‌చెరులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు ఘన నివాళి..
పటాన్‌చెరు:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో గల తెలంగాణ అమరవీరుల స్తూపానికి పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు మలిదశ ప్రత్యేక తెలంగాణఉద్యమం చేపట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారం చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ రంగాలలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
