ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్ జి
ములుగు జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 (భారత శక్తి): వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ ఎన్నికల అధికారి సి హెచ్ మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన పిఓ హ్యాండ్ బుక్ ను బాగా చదవాలని చెప్పారు. పిఓ, ఏపీవో వారికి కేటాయించిన విధుల ప్రకారం పోలింగ్ నిర్వహించాలన్నారు. పీవో పోలింగ్ కేంద్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శింప చేయడం, అభ్యర్థుల ఏజెంట్ల జాబితా పరిశీలన, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం వంటి అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాక బ్యాలెట్ బాక్సులు ముందే తనిఖీ చేసుకోవాలని, పోలింగ్ కు ముందే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు తెరిచి చూపించాలని, అప్పుడే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వారికి తెలుస్తుందని అన్నారు. డిక్లరేషన్ అలాగే పోల్ ప్రారంభం వంటి వాటి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో శాంతిభద్రతలు, అలాగే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారి వివరాలు అన్నింటి పట్ల పిఓ, ఏపిఓ లు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయవలసి ఉంటుందని, ఇందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాలని ఈ విషయం ముందే ఓటర్లకు తెలియజేయాలని చెప్పారు. ఎన్నికలలో ఫారం -16 అత్యంత కీలకమని అన్నారు. బ్యాలెట్ పేపర్ కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తీసుకున్న బ్యాలెట్లు, ఓటింగ్ తర్వాత అప్పజెప్పే బ్యాలేట్ పేపర్ల విషయంలో తేడాలు లేకుండా చూసుకోవాలని, వినియోగించిన బ్యాలెట్లను సైతం సీరియల్ నంబర్ తో సహా వేసుకొని సమర్పించాలన్నారు. ఎన్నికలలో పిఓ డైరీ అత్యంత కీలకమని ఆయన తెలిపారు. అలాగే స్టాట్యూరీ నాన్ స్టాట్యూరీ కవర్లు వీటన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, మరోసారి ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పూర్తి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ (ఏఆర్ఓ) వెంకటేష్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, సూపరిండెంట్ శివ కుమార్, ఎన్నికల శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 (భారత శక్తి): వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ ఎన్నికల అధికారి సి హెచ్ మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన పిఓ హ్యాండ్ బుక్ ను బాగా చదవాలని చెప్పారు. పిఓ, ఏపీవో వారికి కేటాయించిన విధుల ప్రకారం పోలింగ్ నిర్వహించాలన్నారు. పీవో పోలింగ్ కేంద్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శింప చేయడం, అభ్యర్థుల ఏజెంట్ల జాబితా పరిశీలన, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం వంటి అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాక బ్యాలెట్ బాక్సులు ముందే తనిఖీ చేసుకోవాలని, పోలింగ్ కు ముందే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు తెరిచి చూపించాలని, అప్పుడే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వారికి తెలుస్తుందని అన్నారు. డిక్లరేషన్ అలాగే పోల్ ప్రారంభం వంటి వాటి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో శాంతిభద్రతలు, అలాగే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారి వివరాలు అన్నింటి పట్ల పిఓ, ఏపిఓ లు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయవలసి ఉంటుందని, ఇందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాలని ఈ విషయం ముందే ఓటర్లకు తెలియజేయాలని చెప్పారు. ఎన్నికలలో ఫారం -16 అత్యంత కీలకమని అన్నారు. బ్యాలెట్ పేపర్ కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తీసుకున్న బ్యాలెట్లు, ఓటింగ్ తర్వాత అప్పజెప్పే బ్యాలేట్ పేపర్ల విషయంలో తేడాలు లేకుండా చూసుకోవాలని, వినియోగించిన బ్యాలెట్లను సైతం సీరియల్ నంబర్ తో సహా వేసుకొని సమర్పించాలన్నారు. ఎన్నికలలో
పిఓ డైరీ అత్యంత కీలకమని ఆయన తెలిపారు. అలాగే స్టాట్యూరీ నాన్ స్టాట్యూరీ కవర్లు వీటన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, మరోసారి ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పూర్తి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ (ఏఆర్ఓ) వెంకటేష్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, సూపరిండెంట్ శివ కుమార్, ఎన్నికల శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
