కొలను సత్తమ్మగారికి నివాళి
ఎల్బీనగర్:
లెక్చరర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు కొలను సుధాకర్ గౌడ్ మాతృమూర్తి సత్తమ్మ దశదిన కర్మ ఆదివారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్, నాయకులు భీమిడి రామకృష్ణారెడ్డి, కొండోజు శ్రీనివాస్, ఖాజా తదితరులు హాజరయ్యారు.
గ్రామంలోని సుధాకర్ గౌడ్ నివాసానికి చేరుకున్న నాయకులు.. సత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుధాకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
About The Author
13 May 2026
