99 రోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలి: జోనల్ కమిషనర్, కే చంద్రకళ,

99 రోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలి: జోనల్ కమిషనర్, కే చంద్రకళ,

బడంగ్‌పేట్:

బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధిలో 99 రోజుల ప్రణాళికను అధికారులు పక్కాగా అమలు చేయాలని జోనల్ కమిషనర్ కె.చంద్రకల హెచ్చరించారు. ఈ మేరకు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిత్యం చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

​అంతకుముందు, డిప్యూటీ కమిషనర్ పి.సరస్వతి, గ్రూప్-1 ట్రైనీ అధికారి సాయి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అల్మాస్‌గూడ సౌభాగ్యనగర్ కాలనీలో పర్యటించారు. అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అల్మాస్‌గూడలోని కొమటికుంట చెరువు వద్ద ఉన్న ఎస్‌ఎన్‌డీపీ (SNDP) నాలాను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో సేవలు అందని గృహాలను గుర్తించి, వెంటనే వివరాలను అధికారులకు అందజేయాలని గ్రూప్-1 ట్రైనీ అధికారిని ఆదేశించారు.
​ఈ కార్యక్రమంలో డీవైఈఈలు అభినయ్ కుమార్, వెంకన్న, ఏఈలు గంగా ప్రసాద్, హరీష్, సౌమ్య, జ్యోత్స్న, ఏసీపీ కిరణ్ కుమార్, ఏఎంఓహెచ్ ప్రవీణ్, యూబీడీ మేనేజర్ పోకల రావు, వెటర్నరీ అధికారి రవి, ఏఎంసీలు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-10 at 18.22.56

About The Author