ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

కడప : 

WhatsApp Image 2025-09-08 at 6.46.07 PM

కాశినాయన మండలంలోని నరసాపురం గ్రామంలో ఇటీవల మాబుపీరా అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.. విషయం తెలుసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందడాని ఆమెకు తెలిపారు.. ఆమె వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి వైద్యురాలితో యువకుడి మృతి గురించి ఆరా తీశారు.. అనంతరం జిల్లా వైద్యాధికారి కి ఫోన్ చేసి ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు..  రాత్రి సమయంలో ఒక నర్సు, వాచ్మెన్ ను నియమించాలని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆమెతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Read More శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

About The Author