పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

హరితవనంగా ఆర్ట్స్‌ కళాశాల లో పర్యావరణ పరిరక్షణకు వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని,వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజంలో నివసించే అందరి ఆరోగ్యం పరిరక్షించేందుకు వాకర్స్‌ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసికుంటున్నాయని వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ మాజీ గవర్నర్‌ పి.జి.గుప్తా అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో పుట్టపర్తి సత్యసాయిబాబా సన్నిధానం నుంచి వొచ్చిన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత వనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణాన్ని తయారుచేయుటకు స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ముందుకు రావటం ఎంతో అభినందనీయం అన్నారు.సత్యసాయిబాబా భక్తుడు జామి జనార్దనరావు తీసికివొచ్చిన మేలుజాతి మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా వుందన్నారు.ప్రత్యక్ష దైవం గా భావించే బాబా సన్నిధానం నుండి శ్రీకాకుళం నగరానికి సుమారు 30వేల మొక్కలు వొచ్చాయని వీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నాటుతున్నామని సాయి సేవకులు నల్లబాటి కృష్ణమూర్తి, డాక్టర్‌ కె. పాండురంగారావు లు అన్నారు. నిస్వార్థ సామాజిక సేవలకు చిరునామాగా నిలుస్తున్న సత్యసాయి బాబా సన్నిధానం నుండి జిల్లాకు చేరుకున్న మొక్కలు జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ బాబా ఆలయాల ద్వారా భక్తులకు పంపిణీ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో వాకర్స్‌ ప్రతినిధులు ఎస్‌.జోగినాయుడు,బి.వి.రవిశంకర్‌, జి.ఇందిరాప్రసాద్‌, గుడ్ల సత్యనారాయణ, సింహాద్రి వేణుగోపాల్‌, బి.దేవీప్రసాద్‌,నాగేశ్వర ఈశ్వరరావు, గోలీ సంతోష్‌,ఉమా, మల్లిబాబు,మోహన్‌,సంజీవరావు,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts