మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం: చిలుక మధుర ఉపేందర్ రెడ్డి.
ఎల్బీనగర్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లోని వార్డు కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చీరలను అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఆడ బిడ్డకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మహిళలకు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉచిత బస్సు,10 లక్షల వరకు మహిళా సంఘాలకు రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సులను వారి సొంతంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రేణుక, రమా దేవి, కవిత, జయమ్మ, మాధవి, సంతోష, శ్వేత , లావణ్య, ప్రమీల, స్వరూప,రజిత, తదితరులు పాల్గొన్నారు.
