హామీ ఇచ్చారు..అమలు చేశారు..

SVSB అపార్ట్మెంట్ లో సొంత నిధులతో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

హామీ ఇచ్చారు..అమలు చేశారు..

రామచంద్రాపురం:

రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని SVSB అవతార్ గేటెడ్ అపార్ట్మెంట్ లో ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. తాగునీటి అవసరాల కోసం బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల్లోనే బోరు వేయించి.. మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్ వాసుల సమక్షంలో బోరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వడమే కాదు ఆచరణలో చూపించడమే తమ విధానమని తెలిపారు. ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అడిగిన వెంటనే సొంత నిధులతో బోర్ వేయించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు అపార్ట్మెంట్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-23 at 20.17.03 (1)

About The Author