పెన్నార్ కార్మికులకు అండగా బి ఆర్ టి యు

  • మెరుగైన వేతన ఒప్పందం అందించాం
  • అరచేతిలో స్వర్గం చూపిస్తున్న యూనియన్లను తిప్పికొట్టండి
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • పెన్నార్ పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో బిఆర్టియు యూనియన్ ని గెలిపించండి

పెన్నార్ కార్మికులకు అండగా బి ఆర్ టి యు

పటాన్ చెరు:

పెన్నార్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి కార్మికుడికి అండగా నిలుస్తూ మెరుగైన వేతన ఒప్పందం అందించడం తోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని హక్కులు సాధించేందుకు కృషి చేస్తున్న బి ఆర్ టి యు యూనియన్ ను పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో  గెలిపించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఆదివారం మధ్యాహ్నం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బి ఆర్ టి యు (పెన్నార్ ఇండస్ట్రీస్) సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.WhatsApp Image 2026-06-14 at 21.02.13 (1)

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘంగా బి ఆర్ టి యు  యూనియన్ కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ వారి మన్ననలు పొందడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచడంతో పాటు సీటీసి లేకుండా వేతన ఒప్పందం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితి, ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషన్ లోన్, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక సెలవులు, అటెండెన్స్ బోనస్ పెంచడం జరిగిందని తెలిపారు. ఈ నెల 20న జరగనున్న  పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటు వేసి బి ఆర్ టి యు  యూనియన్ నీ గెలిపిస్తే.. అందరికీ ఆమోదయోగమైన వేతన ఒప్పందం, ప్రశాంత వాతావరణంలో విధుల నిర్వహణ, , శాశ్వత ఉద్యోగ నియామకాలను పెంచడం, న్యాయబద్ధంగా యాజమాన్యం నుండి కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ అందించడం  జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోను కార్మికులకు తగు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు..  ఈ సమావేశంలో బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి, యూనియన్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, కార్మిక సంఘం ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-14 at 21.02.13

About The Author

Related Posts