అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన మధుయాష్కి
శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.
ఎల్బీనగర్ :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ శనివారం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
*కుమార్తె పట్టాప్రదానోత్సవానికి హాజరు
మధుయాష్కి కుమార్తె గగన యాష్కి అమెరికాలోని న్యూయార్క్ వైద్య కళాశాలలో వైద్య విద్య (గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన కాన్వాకేషన్ (పట్టాప్రదానోత్సవ) వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇటీవల అమెరికా వెళ్లారు. కుమార్తె విజయవంతంగా విద్యాభ్యాసం పూర్తి చేయడంపై నాయకులు ఈ సందర్భంగా మధుయాష్కికి అభినందనలు తెలిపారు.
ఇటీవల మధుయాష్కి సతీమణి సూచి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో కలిసిన నాయకులు, కార్యకర్తలు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ తమ సానుభూతిని ప్రకటించారు.
మధుయాష్కికి స్వాగతం పలికిన వారిలో పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అనుబంధ సంఘాల కార్యకర్తలు ఉన్నారు.
About The Author
12 Jun 2026
