బీరంగూడ స్మశాన వాటిక కబ్జా నుండి కాపాడండి.

బీరంగూడ స్మశాన వాటిక కబ్జా నుండి కాపాడండి.

అమీన్ పూర్:

బీరంగూడ స్మశాన వాటిక కబ్జా నుండి కాపాడి సమాధులు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని బీరంగూడ గ్రామ అధ్యక్షులు అదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు  డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్బంగా గ్రామ పెద్దలు అదెల్లి రవీందర్ ఎడ్ల రమేష్ రమేశగౌడ్  మాట్లాడుతూ బీరంగూడ స్మశాన వాటిక అనుకోని 993 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి ప్రయత్నస్తూ బీరంగూడ గ్రామస్తుల సమాధులు తొలగించరాని తక్షణమే కబ్జాదారులను కఠినంగా శిక్షిస్తూ బీరంగూడ స్మశాన వాటిక కబ్జా కాకుండా తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. తక్షణమే చర్యలు తీసుకొంటామని డిప్యూటీ తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు.
 ఈకార్యక్రమంలో బీరంగూడ కమిటీ అధ్యక్షులు అదెల్లి రవీందర్   మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ నందరం రమేష్ గౌడ్ ఉపాధక్షులు పిర్జపతి సత్యనారాయణ నక్కలకిష్టయ్య ప్రధాన కార్యదర్శి చిన్న వీరేశం కార్యదర్శి దండు జ్ఞానేశ్వర్ కోశాధికారి బంటు శివ కార్యవర్గ సభ్యులు బంటు ప్రవీణ్  మాకం బిక్షపతి ప్రభాకర్ ఎడ్ల అశోక్  తదితరులు పాల్గొన్నారు.

About The Author