ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక కబ్జా చేసి ‘ఇన్సోమియా పబ్’ అక్రమ నిర్మాణం !

  • ఎమ్మార్వో వెంకటరెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి, అవినీతిపై కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టి సారిస్తారా..!
  • సి.ఎం.సి కమిషనర్ శ్రీజన ఐఏఎస్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
  • మున్సిపల్, రెవెన్యూ అధికారుల ‘ముడుపుల’ నిద్రమత్తు.. రెండు నెలలుగా అటకెక్కిన సర్వే ఆదేశాలు.

ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక  కబ్జా చేసి ‘ఇన్సోమియా పబ్’ అక్రమ నిర్మాణం !

*ఐటీ కారిడార్‌లో శవాల సాక్షిగా సాగుతున్న అక్రమార్కుల ‘ఇన్సోమియా’ పబ్ దందాకు స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోలపాడుతున్నారు. శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసి కడుతున్న అక్రమ కట్టడాలపై ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించినా, స్థానిక ఎమ్మార్వో, సర్వేయర్లకు మాత్రం ఆ ఫైళ్లు ‘కంటి నిండా నిద్ర’ పోనివ్వడం లేదు. పైస్థాయి నుంచి నోటీసులు వచ్చినా, పబ్ యాజమాన్యం విసిరే నోట్ల కట్టల ముందు ఆ ఉత్తర్వులు వెలవెలబోతున్నాయి. చనిపోయిన వారి స్థలాన్ని కూడా వదలకుండా దోచుకుంటున్న ఈ అవినీతి తిమింగలాల నిర్వాకంపై ‘
పూర్తి ఆధారాలతో "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రేట్స్" అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..

WhatsApp Image 2026-06-14 at 17.29.09

*హైదరాబాద్:

రాష్ట్ర రాజధానిలోని అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఖాజాగూడ పరిధిలోని సర్వే నంబర్ 2, 3 లలో ఉన్న ప్రభుత్వ శ్మశానవాటిక భూమిని ‘ఇన్సోమియా పబ్’ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 4 లో నిర్మాణ అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా శ్మశానవాటికకు చెందిన ప్రభుత్వ భూమిలో ఈ భారీ కట్టడాలను లేపినట్లు స్థానికులు ఘోషిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం భారీగా ముడుపులు అందుకుని ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందనే విమర్శలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

*ఉన్నతాధికారుల ఉత్తర్వులు బేఖాతర్!
ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ నగర ప్రణాళికా విభాగం సహాయ కమిషనర్ (ఏసీపీ) వెంకటరమణ, అలాగే సీఎంసీ ఉన్నతాధికారులు సదరు స్థలంలో తక్షణమే భూ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ స్థానిక మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) కార్యాలయానికి అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

*‘ముడుపుల’ మత్తులో ఎమ్మార్వో, సర్వేయర్?
జీహెచ్ఎంసీ, సీఎంసీ వంటి ఉన్నత సంస్థల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. సర్వే నిర్వహించాల్సిన స్థానిక ఎమ్మార్వో వెంకట్ రెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి ఆక్రమణదారుల నుంచి భారీగా ముడుపులు అందుకుని కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బాధితులు, స్థానికులు పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా "ఈరోజు - రేపు" అంటూ కాలం గడుపుతున్నారని, కనీసం ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.WhatsApp Image 2026-06-14 at 17.35.16

*జోనల్ మున్సిపల్ అధికారుల ‘మామూళ్ల’ నిశ్శబ్దం!
ఈ వ్యవహారంలో కేవలం రెవెన్యూ విభాగమే కాకుండా, శేరిలింగంపల్లి మండలం పరిధిలోని సర్కిల్ 49 మున్సిపల్ అధికారులు, జోనల్ అధికారులు కూడా భారీ ఎత్తున లంచాల రుచి మరిగారని, అందుకే అక్రమ నిర్మాణాలు కళ్లముందే జరుగుతున్నా కన్నెత్తి చూడటం లేదని సమాచారం. ప్రభుత్వ భూమిని కాపాడాలనే కనీస బాధ్యత లేకుండా, ప్రైవేట్ పబ్ యాజమాన్యం దౌర్జన్యాలకు అధికారులు మద్దతుగా నిలవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

*రంగంలోకి అవినీతి నిరోధక, మానవ హక్కుల వేదిక
ప్రభుత్వ శ్మశానవాటిక భూమి ఆక్రమణ ఉదంతంపై ‘అవినీతి నిరోధక, మానవ హక్కుల వేదిక’ (యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్) తీవ్రంగా స్పందించింది. తక్షణమే వివాదాస్పద స్థలంలో సర్వే జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగా సర్వేను ఆలస్యం చేస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి: స్థానికుల డిమాండ్

ప్రభుత్వ భూముల రక్షణలో స్థానిక అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సర్వే ప్రక్రియను పూర్తి చేయించాలని, శ్మశానవాటిక భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించాలని ఖాజాగూడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.WhatsApp Image 2026-06-14 at 17.29.10 (1)

About The Author